
* మంత్రి దామోదర రాజనర్సింహ
*మహబూబాబాద్ లో మెడికల్, నర్సింగ్ కళాశాల ప్రారంభం
ఆకేరు న్యూస్ , మహబూబాబాద్ : రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలో మౌలిక
వసతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబాబాద్ కేంద్రం లో మెడికల్, నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళవారం ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్,దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో రూ.186 కోట్ల వ్యయంతో నిర్మించి ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజ్ ప్రారంభించామన్నారు. ఆదివాసి ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపట్టిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు (16) ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు నిర్మించి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించడం కోసం నిబద్దతతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………..