
* తెలుగు రాష్ట్రాల్లో నేడు భిన్న వాతావరణం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు విభిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం వరకూ విపరీత వడగాల్పులు ఉంటాయని, అలాగే సాయంత్రం వర్షాలూ కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ(Telangana)లోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 43.8, కనిష్టంగా భద్రాచలం లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదుతో వడగాల్పులు వీస్తాయన్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని 28 మండలాల్లో తీవ్రంగా శ్రీకా కుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 21 మండ లాల్లో మోస్తరు పడగాడ్పులు వీస్తాయని విపత్తుల శాఖ హెచ్చరిక జారీ చేసింది. అక్కడక్కడ ఆకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
………………………………..