
* రహదారులు జలమయం
* ట్రాఫిక్‌తో ఇబ్బందులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉదయం ఉక్కపోత.. రాత్రి కుండపోత అన్నచందంగా మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ 32.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఆ తర్వాత వాతావరణంలో మార్పు.. రాత్రి వర్షం.. ప్రజల ఇక్కట్టు.. ఇదీ నగరవాసుల జీవనం. హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు గడగడలాడుతున్నాయి. బంజరాహిల్స్ (banjara hills), జూబ్లీహిల్స్ (jubli hills), గచ్చిబౌలి (Gacchibouli), మాదాపూర్ (Madhapur), ఖైరతాబాద్ (Khairathabad), షేక్‌పేట (Shaikpet), మీయాపూర్ (miyapur); ఫిలింనగర్ (Filmnagar), చందానగర్ (chandapur), మణికొండ (Manikonda) తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది. దీంతో ఐటీ కారిడార్ నుంచి నగరం నలువైపులా వెళ్లే ప్రాంతాల్లో రోడ్లపై వరదనీటితో ట్రాఫిక్ జామ్ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాయదుర్గం నుంచి మెహిదీపట్నం, నానల్‌నగర్, మాసబ్‌ట్యాంక్ వెళ్లే మార్గంలోనూ ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు సాగింది. కాగా మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లింగంపల్లిలో అత్యధికంగా 5.1 సెం.మీ, చందానగర్‌లో 4.4 సెం.మీ వర్షం కురిసింది. కాగా, గ్రేటర్ పరిధిలో మరో రెండురోజుల పాటు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
………………………………………