
ఆకేరున్యూస్, సూర్యాపేట: ఆస్తి తర్వాతే ఏ బంధమైనా అనుబంధాలు, ఆత్మీయతలన్నీ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటున్నాయి. తల్లి శవం ముందు ఆస్తి పంపకాల పంచాయితీ పెట్టారు ఓ అక్కా,చెల్లెల్లు. దీంతో మూడు రోజులు తల్లి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో జరిగింది. పొదిల నర్సమ్మ అనే 80 సంవత్సరాల వృద్ధురాలు ఈనెల 14న అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు వెంకటమ్మ, కళమ్మ అనే ఇద్దరు కూతుర్లున్నారు. సూర్యాపేట లో ఉంటున్న చిన్న కూతురు కళమ్మ వద్ద తల్లి వనర్సమ్మ మృతి చెందింది. ఆత్మకూర్ ఎస్‌లో ఉంటున్న తన అక్క వెంకటమ్మ ఇంటికి తల్లి నర్సమ్మ మృతదేహాన్ని తీసుకెళ్ళింది. తల్లికి సంబందించిన బంగారం, నగదు, వెండి, ఇతర ఆస్తుల విషయంలో అక్కా చెళ్ళెల్ల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది తల్లికి సంబందించిన ఆస్తిపంపకాలు పూర్తయిన తర్వాత తల్లి అంత్యక్రియలు చేస్తామని ఇద్దరూ భీష్మించుకు కూర్చున్నారు. గ్రామ పెద్దలు, బంధువులు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. మూడు రోజులుగా తెగని ఈ పంచాయతీ గురించిన సమాచారం పోలీసులకు చేరింది. దీంతో ఎస్సై శశ్రీకాంత్ గౌడ్ రంగంలోకి దిగి ఇద్దరికీ నచ్చచెప్పడంలో తల్లి అంత్యక్రియలు నిర్వహించారు.
…………………………………