
– రెండు సభలలో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఎందుకు కోర్టుకు వెళ్లొద్దని అంటున్నారు
– ఎవరిని మోసం చేద్దామని షెడ్యూలు ప్రకటించారు
– బీహార్, మహారాష్ట తరహాలో ఎన్నికలు రద్దు అయితే అభ్యర్థులు పెట్టుకున్న ఖర్చుకు ఎవరు భాద్యులు
– హుజురాబాద్ నియోజకవర్గంలోనే 9 గ్రామాలలో సర్పంచ్ రిజర్వేషన్ల లో తప్పులు జరిగాయి
– రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని తప్పులు జరిగి ఉండొచ్చు
– ఇలా మాట్లాడుతున్నానని నేను దేనికి వ్యతిరేకం కాదు
– మల్కాజ్గిరి ఎంపీ,ఈటల రాజేందర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విధంగానే రిజర్వేషన్లు ఉంటాయని, ఎన్నికలు యథా విధిగా జరుగుతాయనీ ప్రభుత్వం ప్రకటన చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కమలాపూర్‌లోని ఈటల రాజేందర్ స్వగృహంలో మండలాల వారీగా నాయకులతో ఈటల చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ..ఎంపరికల్ డేటా సేకరించి, డెడికేషన్ కమిషన్ వేసి,రెండు సభలలో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత కూడా ఎందుకు మీరు కోర్టుకు వెళ్లొద్దని అంటున్నారనీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలలో ప్రకటించిన రిజర్వేషన్లపై పలు పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం.. కొన్ని తండాలలో బీసీలు, ఓసీలు లేకపోయినా ఆయా గ్రామాలకు బిసి రిజర్వేషన్లు ప్రకటించారనీ ఈటల అన్నారు. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే 9 గ్రామాల సర్పంచ్ ల రిజర్వేషన్లలో తప్పులు జరిగాయని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 80 పైగా రూరల్ నియోజకవర్గాలలో ఇంకా ఎన్ని తప్పులు దొర్లి ఉంటాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.బీహార్‌లో 2023లో బీసీ రిజర్వేషన్లు 65 శాతానికి పెంచితే సుప్రీంకోర్టు దానిని కొట్టివేసిందనీ,మహారాష్ట్రలో 2021 లో వికాస్ కిషన్ రావు గవాలి సుప్రీంకోర్టుకు పోతే 5 జిల్లాల జరిగిన ఎన్నికలు రద్దు చేసిందనీ గుర్తు చేశారు.ఇంత పెద్ద గంభీరమైన విషయంలో బీహార్, మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రజలను వంచించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో 1,12,000 మంది వార్డు మెంబర్లు, 12765 మంది సర్పంచులు, 5800 ఎంపీటీసీలు, 650 మంది జెడ్పిటిసిలకు సుమారు 5 లక్షల మంది పోటీ చేస్తారనీ ఈటెల అన్నారు. పోటీలో ఉన్న లక్షలమంది వార్డు మెంబర్ తో సహా అంతో ఇంతో ఖర్చు పెట్టుకుంటారనీ, షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల్లో పోటీ చేసే వారందరూ ఖర్చుకు సిద్ధమయ్యారన్నారు. డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకుంటే బాధ్యులు ఎవరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇలా మాట్లాడుతున్నామని తన పై బురదజల్లే ప్రయత్నం చేయవద్దనీ 42 శాతం బీసీ రిజర్వేషన్‌కు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాము మేము బీసీలకు రావాల్సినవి కావాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా ప్రజలకు సూచన చేసి మార్గదర్శన ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
………………………………………………….