
* గాదరి కిశోర్ కు నోటీసులు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (MP CM RAMESH) మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ (GADARI KISHOR) పై జూబ్లీహిల్స్ (JUBLEE HILLS POLICE STATION) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గాదరి కిశోర్ కు నోటీసులు పంపించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా గాదరి కిశోర్ ను ఆదేశించారు. ఇటీవల సీఎం రమేష్ బీఆర్ ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై చేసిన వ్యాఖ్యలకు గాదరి కిశోర్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ పై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపధ్యంలో గాదరి కిశోర్ తనపై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం రమేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గాదరి కిశోర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవల్సిందిగా పోలీసులను కోరారు.
………………………………………………..