* వరంగల్ ఎంపీ కడియం కావ్య
స్టేషన్ ఘన్ పూర్, ఆకేరు న్యూస్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధి నాయకులు, ఆశవహులు, ఇంచార్జ్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతీ ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ గెలుపు కోసం పని చేయాలని తెలిపారు. మనందరం కలిసి కట్టుగా పని చేసి 18వార్డులలో గెలిచి ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. బేదాభిప్రాయాలకు పోయి పార్టీకి నష్టం కలిగించకూడదని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ ఏ చిన్న సమన్వయ లోపం జరిగినా పార్టీకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇప్పటికే 50 కొట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరో 50 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చే బాధ్యత నాది, ఎమ్మెల్యేదని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలలో 18 కి 18 వార్డులలో గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ శక్తి వంచన లేకుండా పని చేయాలని, మీకు తోడుగా నేను, ఎమ్మెల్యే గారు ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో చిల్పూర్ దేవస్థానం చైర్మన్ శ్రీధర్ రావు, బేబీ శ్రీనివాస్, గడ్డమీద సురేష్, ఎడవల్లి మల్లారెడ్డి, ఎనగందుల నరసింహారెడ్డి, బిల్డ వెంకన్న, స్వామి నాయక్, రాజేష్ నాయక్ నాయకులు, అభ్యర్థులు, వివిధ మండల వార్డు ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………
