* రాబోయే స్థానిక ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలి..
ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ ముదిరాజ్ , ములుగు జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ లు కోరారు . ములుగు జిల్లాలోని ఇంచార్ల గ్రామంలో ముదిరాజ్ మహాసభ జెండాను ముదిరాజ్ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ యువత అన్నీ రంగాల్లో రాణించాలని , యువతీ , యువకులు రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు. జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో 11% ఉన్నామని అన్నారు. స్థానిక ఎన్నికలలో సముచితం స్థానం కల్పించకపోతే స్వతంత్రంగా నిలబడి గెలిచి చూపిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులు సాధు రఘు ముదిరాజ్ , లక్నవరం చైర్మన్ పులుగుర్తీ వెంకన్న ముదిరాజ్ , జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట మల్లన్న ముదిరాజ్ , మాజీ సర్పంచ్ మోరె రాజయ్య , తాడ్వాయి మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రంగారబోయిన జగదీష్ ముదిరాజ్ , మాజీ ఎంపీటీసీ అశోక్ ముదిరాజ్ , మాజీ ప్రజాప్రతినిధులు , ముదిరాజ్ మహిళా నాయకురాలు , ముదిరాజ్ యువతీ , యువకులు , తదితరులు పాల్గొన్నారు.

……………………………………………..
