* తీర్థ ప్రసాదాలను అందించిన తీతీదే
ఆకేరు న్యూస్, తిరుమల : తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత అంబానీ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు శాలువా కప్పి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
…………………………………
