ఆకేరు న్యూస్,ములుగు: గత ప్రభుత్వం అమలుపరిచిన జీవో 239 స్ఫూర్తితో 252 జీవోను సవరించాలంటూ
ములుగు జిల్లా కేంద్రంలో టియుడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.. శనివారం టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన అక్రిడేషన్ల జారీ కోసం జీవో నెంబర్ 252 సవరించాలంటూ ఆందోళన చేపట్టి కలెక్టరేట్ కార్యాలయంలోని ఏవోకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 252 జీవోలోని కొన్ని నిబంధనల తో ఇప్పటివరకు అక్రిడిటేషన్లు కలిగిన దాదాపు 10 వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్లను కోల్పోయే ప్రమాదం ఉందని ములుగు జిల్లా యూనియన్ సీనియర్ నాయకులు, ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టే రాజీరెడ్డి అన్నారు. గతంలో అమలులో ఉన్న జీవో నం.239 ప్రకారం బిగ్ పేపర్ల 20 మంది కరస్పాండెంట్లు, 20 మంది డెస్క్ జర్నలిస్టులు, 4 మంది కెమెరామెన్లకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేవారు. అయితే ప్రస్తుతం జీవో నం.252 ద్వారా ఈ సంఖ్యను 12 కరస్పాండెంట్లు, 12 డెస్క్ జర్నలిస్టులు, 3 కెమెరామెన్లకు తగ్గించడం జరిగిందని. జిల్లా స్థాయిలో ఈ తరహాలో కోత విధించారని ఆరోపించారు. మీడియం పత్రికలు, శాటిలైట్ ఛానళ్లకు గణనీయమైన కోత విధించడం బావ్యం కాదన్నారు. గతంలో కేబుల్ ఛానళ్లకు ఐ & పి ఆర్ ద్వారా రాష్ట్ర స్థాయిలో 12 అక్రిడిటేషన్లు మంజూరు చేయబడేవని, ప్రస్తుతం వాటిని పూర్తిగా సున్నాకు పరిమితం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు. గతంలో నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు అక్రిడిటేషన్లు మంజూరు చేయబడేవని, కానీ నూతన జీవోతో వాటిని పూర్తిగా తొలగించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులను వేరు చేస్తూ ‘మీడియా కార్డు’ పేరిట విభజన తీసుకురావడం జర్నలిస్టు సమాజంలో తీవ్ర చర్చకు, అసంతృప్తికి దారితీస్తోందని,ఇది ప్రభుత్వ ప్రతిష్ఠకు కూడా భంగం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.పదిహేను వేల కంటే తక్కువ సర్కులేషన్ ఉన్న చిన్న పత్రికలకు అన్యాయం జరిగిందని ,గతంలో నియోజకవర్గ స్థాయిలో ఇచ్చే కార్డు ప్రస్తుతం కట్ అయ్యిందని అన్నారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అన్న తేడా లేకుండా అందరినీ మీడియా అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించే విధంగా, జర్నలిస్టులౄ ఉపాధి, గౌరవం, హక్కులను పరిరక్షించేలా జీవో నం.252ను సవరించి న్యాయం చేయలని యానియన్ పక్షన ప్రభుత్వన్ని డిమాడ్ చేశారు.ఈ కార్యక్రమంలో దూడబోయిన రాకేష్, చుంచు రవి, గాదం దేవేందర్, మోడెం సారంగపాణి, బోయిన పల్లి శ్రీధర్, మాట్ల సంపత్, పోలోజు రామ్మూర్తి, వేముల సతీష్, ఆవుల వెంకన్న, కోరి అరవింద్, గొల్ల నరేందర్, రాజు, కంది జీవన్ రెడ్డి, సల్లూరి మహేందర్, సుంకరి సంపత్, పత్తి కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………..

