* ములుగు జిల్లా ఎస్పీ.
ఆకేరు న్యూస్, ములుగు: అరణ్యమే ఆలయంగా… ప్రకృతే దేవతలు అనే భావనకు ప్రతీకగా నిలిచే మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ నివారణ అందరి లక్ష్యం అని ములుగు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్ నాథ్ కేకన్ కోరారు. వనదేవతల సన్నిధిలో ప్రకృతిని కలుషితం చేయరాదన్న సంకల్పంతో ‘ప్లాస్టిక్ రహిత మేడారం’ లక్ష్యంగా పోలీస్ అధికారులు స్వచ్ఛందగా ఇతర శాఖల అధికారులసమన్వయంతో చర్యలు చేపట్టారు.
జాతర పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధానికి అడుగులు వేశారు. ప్లాస్టిక్ కవర్లతో కూడిన బఫ్ ప్లేట్లు, గ్లాసులు, బాటిళ్ల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వాటి స్థానంలో ప్రకృతి వరప్రసాదితమైన ఆకులతో తయారుచేసిన విస్తారాకుల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ వినాయక గ్రామైఖ్య సంఘం ములుగు మండలం,జగ్గన్న పేట మహిళల ఆధ్వర్యంలో ఆకులతో తయారుచేసిన విస్తారాకులను పరిశీలించారు.గుడ్డతో తయారుచేసిన సంచులు, కాగితపు ప్యాకెట్లు వినియోగించాలంటూ భక్తులకు సూచించారు.వనదేవతలకు చేసే పూజలతో పాటు,వనాల పరిరక్షణ కూడా భక్తుల తమ బాధ్యతగా ఉండాలన్నారు.అందరి సహకారంతోనే ప్లాస్టిక్ రహిత మేడారం లక్ష్యం సాధ్యమని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్ , ఆదివాసి నవనిర్మాణం సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొర్స నరసింహమూర్తి, జిల్లా సమాఖ్య మేనేజర్ కిషన్ రావు పాల్గొన్నారు.
……………………………………………………
