ఆకేరు న్యూస్,ములుగు : జిల్లాలోని టాస్క్ శిక్షణ కేంద్రం ద్వారా తుది దశ మూల్యాంకనంలో ఎంపికైన 12 మంది విద్యార్థులకు శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సి హెచ్ మహేందర్ జీ తన ఛాంబర్లో టెలిపెర్ఫార్మెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి జారీ చేసిన నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జిల్లాలోని టాస్క్ ములుగు రీజినల్ సెంటర్లో టెలిపెర్ఫార్మెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో డిసెంబర్ 1, 2025న ప్లేస్మెంట్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు. ఈ డ్రైవ్ లో మొత్తం 60 మంది విద్యార్థులు పాల్గొనగా, మొదటి దశ స్క్రీనింగ్ అనంతరం 22 మంది విద్యార్థులు రెండో దశకు ఎంపిక అయ్యారని వారికి సంస్థ ద్వారా ఒక వారం పాటు శిక్షణ అందించడం జరిగినదని తెలిపారు. పూర్తి శిక్షణ పొందిన వారికి నియామక పత్రాలు అందించామని వివరించారు. ఈ కార్యక్రమములో మేనేజర్, ములుగు రీజినల్ సెంటర్ మురళి కృష్ణ, ఎంపికైన 12 మంది విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………

