* అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సి.హెచ్.మహేందర్ జి.
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గల ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళశాలలో మెరుగైన పలితాలు సాధించాలని, ప్రతీ ఒక్క విద్యార్థి ఉత్తీ ర్ణత సాధించేలా ఖుషి కృషిచేయాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి. అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్, సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీ డియట్ పరీక్ష ఫలితాల్లో ఆయా కళాశాల వారిగా గత ఏడాది, ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన పరీక్షల ఫలితాలపై సమీక్ష నిర్వహించి ఎదురైన సమస్యల పై ప్రిన్సిపాల్ లను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్, ఆధ్యాపకులు విద్యార్థులు అన్ని సబ్జెక్ట్ పైన ఎక్కువ ఏకాగ్రత పెట్టాలని కఠిన సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చదివించాలన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలో బోర్డ్ పరీక్షల వరకు 50 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యాలని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత కావాలని ఆదేశించారు. ప్రతి విద్యా ర్థులనీ ప్రోత్సహించి చదువులో మంచి ఉత్తీర్ణత సాధిస్తే వచ్చే ఏడాదీ ఎక్కువ కళాశాలలో అడ్మిషన్లు వస్తాయని ,అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆదేశించారు. ప్రిన్సిపల్, ఆధ్యాపకులు విధులు సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులపై శ్రద్ధ వహించి మంచి చదువు క్రమశిక్షణ నేర్పించాలని, విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకు నేలా తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి డి. చంద్ర కళ ఆయా కళాశాలల ప్రిన్నిపల్స్ తదితరులు పాల్గొన్నారు.

……………………………………

