ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా లో అటవీ ప్రాంతంలో గల పస్రా తాడ్వాయి మార్గ మద్యలో జలగలంచ వాగులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం రాత్రి పునఃప్రారంభం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ .. ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం జిల్లాలో వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ఒకటని ఇక్కడ పర్యాటకులకు కనువిందు కలిగించే ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయని చెప్పారు. పర్యాటకులు బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ను సందరించాలని మంత్రి సీతక్క కోరారు.
మంత్రి సీతక్క వెంట జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ , ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి జిల్లా స్థాయి అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………..

