* జిల్లా కలెక్టర్ జెసి దివాకర
ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుతం జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల పోటీలో పాల్గొనే అభ్యర్థులు ఎన్నికల సంఘం సూచించిన ఖర్చుల పరిమితులను పాటించాలని జిల్లా కలెక్టర్ జెసి దివాకర కోరారు .ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల మందికి పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు, 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు పోటీ చేయు సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులకు అభ్యర్థుల గరిష్ఠ ఖర్చు పరిమితును పాటించాలని సూచించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీ – సర్పంచ్ 2,50,000. 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ 1,50,000. 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ 50,000, 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ – ఉపసర్పంచ్ 30,000. లోబడి ఖర్చు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల పుస్తకాలను సక్రమంగా నిర్వహించాలని, నిర్ణయించిన పరిమితులకు లోబడి ఖర్చు చేయాలని, ఎన్నికల నియమాలు ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఖర్చుల పరిశీలన సంబంధిత పత్రాలు సమర్పణపై సంబంధిత రిటర్నింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామస్థాయిలో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
…………………………………….
