ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క తాడ్వాయి మండలంలోని గంగారం పంచాయితీలో గల అన్నారం గొత్తి కోయగూడెంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలతో ములుగు జిల్లా పాలనాధికారి, ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కలెక్టర్ దివాకర సూచనలతో 20 కుటుంబాలకు అభయ ఫౌండేషన్ అందించిన 6 కుర్తాలు, 44 పిన్నోస్ ,44 బ్లౌజ్ లు, 16 బ్లాంకెట్స్, 44 నెక్కర్స్, 6 పైజామాలు, 26 ట్రవుసెస్, 66 షర్ట్స్ తదితర రకాల దుస్తులను గ్రామపంచాయతీ సర్పంచ్ బడే రజిత ,ఉపసర్పంచ్ కోమల ల చేతుల మీదుగా గురువారం రెడ్ క్రాస్ ములుగు జిల్లా పాలక మండలి సభ్యులు కోగిల సారయ్య ,గోవర్ధన్, సురేష్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొండూరి నరేష్ రమేష్ తో పాటు గొత్తి కోయ గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

………………………………………………

