ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు కొత్త మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 14, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రములో బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నిర్భయంగా ఓటు వేయాలని స్థానిక సుపరిపాలనలో భాగస్వాములు కావాలని అన్నారు. సాయంత్రం 5:00 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంప్స్ నిర్మించడమే కాక వీల్ చైర్స్ ను అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 18 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి పోలింగ్ స్టేషన్ లొ అక్కడి అధికారులకు చూపించి ఓటర్లు తమ ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
—————————————————
