* అభినందించిన ములుగు ఎస్పి.
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న ఎన్. రవీందర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన శౌర్య పథకంను ప్రదానం చేసింది. తన విధి నిర్వహణలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలు, కర్తవ్యనిష్ఠకు గాను ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో.
ములుగు జిల్లా ఎస్ పి శ్రీ సుధీర్ రామనాథ్ కేకాన్ డీఎస్పీ ఎన్. రవీందర్ ను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం డి ఎస్ పి చేసిన సేవలు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు నిరోధక చర్యల్లో చేసిన కృషి, వరద సహాయక చర్యల తో పాటు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో, గ్రామపంచాయతీ ఎన్నికలు, మేడారం మహాజాతర నిర్వహణలో డీఎస్పీ రవీందర్ చూపిన ధైర్యం, సమర్థత ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు.
ఇలాంటి అధికారులు జిల్లా పోలీస్ విభాగానికి గర్వకారణమని, యువ పోలీస్ అధికారులకు ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్ పీ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………

