* జిల్లా వ్యవసాయ అధికారి
ఆకేరు న్యూస్,ములుగు :జిల్లా వ్యాప్తంగా రైతులు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ బాబు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రిజిస్ట్రేషన్ ప్రతి రైతుకు ఒక గుర్తింపు నెంబరు కేటాయించుటకు నిర్ణయించిందని తెలిపారు.రిజిస్ట్రేషన్ చేయించుకొనుటకు ప్రతి రైతు తమ పట్టాదారు పాసు బుక్కు సమీప మీసేవ కేంద్రంలో గాని లేదా వ్యవసాయ విస్తీర్ణ అధికారిని గాని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని కోరారు .అదేవిధంగా యాసంగి పంటలకు సంబంధించి ములుగు జిల్లాకు అవసరమైన యూరియా సరఫరా చేయుటకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవాలని కోరారు.
……………………………………………

