
ములుగు – వరంగల్ ప్రధాన రహదారి లో రాకపోకలకు అంతరాయం
* వాహనాల దారి మళ్లింపు
ములుగు , ఆకేరు న్యూస్ : ములుగు – వరంగల్ ప్రధాన రహదారిలోని బ్రిడ్జి కూలి పోయింది.. ములుగు జిల్లా మల్లంపల్లి శివారు ఎస్సారెస్పీ కెనాల్ మీద నిర్మిస్తున్న బ్రిడ్జి గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలి పోయింది.. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..
వాహనాల దారి మళ్లింపు
ములుగు మీదుగా హనుమకొండకు వచ్చే వాహనాలను పోలీసులు అబ్బాపూర్ వయా కొత్తపల్లి, రేగొండ పరకాల, గూడప్పాడు మీదుగా పంపిస్తున్నారు.. అదేవిదంగా హనుమకొండ నుంచి ములుగు మీదుగా వెళ్లే వాహనాలను గూడెప్పాడ్ , పరకాల, రేగొండ,గోరి కొత్తపల్లి , అబ్బాపూర్ మీదుగా దారి మళ్ళించారు.
——-
—-