* భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి
* మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి
ఆకేరు న్యూస్, ములుగు:ప్రస్తుతం ఈ నెలలో 28 నుంచి 31 వరకు జరగబోయే మేడారం మహా జాతర 2026 ను సమర్థవంతంగా నిర్వహించాలని మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి సమీక్ష సమావేశంలోఅధికారులను ఆదేశించారు.మొదటగా ఆయన మేడారం దేవతల దర్శించుకుని ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. పోలీస్ అధికారులను ఆలయ మర్యాదల ప్రకారం పూజారులు సన్మానించి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మేడారం ఆలయ ప్రాంగణం లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి ఆరా తీసి, త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల ఆవరణలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా జాతరకు లక్షలాది ప్రజలు తరలి వస్తారని, దానికనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంతో దూరం నుండి వచ్చే భక్తులకు దర్శనం సులభంగా జరిగేలా తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఆయా జోన్ లలో, సెక్టార్ లలో తిరిగి పని చేయాలని సూచించారు. జాతరకు ఎంత సిబ్బంది అవసరమైతే అంత మందిని తీసుకోవాలని, ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసే బందోబస్తుకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు.మేడారం జాతర పరిసరాలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచన చేశారు. ఎట్టి పరిస్థితులను ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చి వెళ్లే వాహనాల దారి మళ్లింపు విషయమై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ తోపాటు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, కరీంనగర్ సిపి గౌస్ ఆలం, మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరిష్ పి , భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ , రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ గీతే బాబాసాహెబ్, అడిషనల్ ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు

………………………………………………….

