* మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. గురువారం తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అదనపు లేబర్ ను ఉపయోగించుకొని 24 గంటలు షిఫ్ట్ ల వారిగా పనులు చేయాలని, నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్, రామ్ నాథ్ కేకాన్ సాయంత్రం పోలీసు అధికారులతో మేడారంలో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ అధికారులు, గుత్తేదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
