బడే నాగజ్యోతి
* పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలి
* బడే నాగజ్యోతి
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల పెంచిన ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులను (Property Tax and Commercial Tax) తక్షణమే తగ్గించాలని బీఆర్ఎస్ (BRS) పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు పన్నుల భారం మోపడం అన్యాయమని పేర్కొంటూ గురువారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్ఎస్ ములుగు మండల మాజీ అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బడే నాగజ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌ను కలిసి పెంచిన పన్నులను తగ్గించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వ్యాపారులు కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులను భారీగా పెంచి ప్రజలపై మరింత భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మంత్రి సొంత నియోజకవర్గం, సొంత మండలమైన ములుగు అభివృద్ధికి ప్రభుత్వ నిధులు తీసుకురావాల్సింది పోయి, ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు (Special Funds) తీసుకువచ్చి ములుగు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేయడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదని, ప్రజల హక్కుల కోసం ఉద్యమించడం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలపై మోపిన అదనపు పన్నుల భారాన్ని తగ్గించే వరకు వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
పెంచిన పన్నులను వెంటనే తగ్గించకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పోమ నాయక్, జిల్లా నాయకులు వేములపల్లి బిక్షపతి, ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్ రామ్ నాయక్, భూక్య జంపన్న, ములుగు కౌన్సిలర్లు బైకాని సునీత ఓదెలు, బైకాని సాగర్, గండ్రకోట వాణికుమార్, వేణు, లక్ష్మి, భరత్, యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేష్, మాజీ ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, గరిగె రఘు, పైడిమల్ల భాస్కర్, సంతోష్, ముంజాల బిక్షపతి, రాణా ప్రతాప్, రవిరామన్, సారయ్య, వంకూడోతు రాందాస్, మోహన్, నవీన్, గండి కుమార్, ఆకుతోట చంద్రమౌళి, శేఖర్, కార్తీక్, చంటి, రంజిత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

