
* రూట్ మ్యాప్ విడుదలచేసిన డీఎస్పీ
* మల్లంపల్లి, జాకారం మధ్య దెబ్బతిన్న వంతెన
ఆకేరున్యూస్ ములుగు : జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారి 163 పై మల్లంపల్లి , జాకారం మధ్య SRSP కెనాల్ పై పాత వంతెన దెబ్బతినడంతో, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఈ రూట్లలో వెళ్లే వాహనాల రూట్లలో మార్పులు చేసినట్లు ములుగు డీఎస్పీ శబరీష్ తెలిపారు ఈ మేరకు డీఎస్పీ కార్యాలయం నుండి రూట్ మ్యాప్ ను వివరిస్తూ ప్రకటన విడుదల చేశారు. వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనాలు ఈ రూట్లలోనే వెళ్లాల్సి ఉంటుందని డీఎస్పీ కోరారు.
*డైవర్షన్ రూట్ మ్యాప్
1. వరంగల్ నుండి ములుగు వైపు ప్రయాణించే లారీలు, డీసీఎంలు, ఇతర భారీ వాహనాలు
గూడెప్పాడు నుండి పరకాల మీదుగా రేగొండ ,జంగాలపల్లి మార్గంలో ప్రయాణించాలి.
తిరుగు ప్రయాణంలో జంగాలపల్లి నుండి రేగొండ మాదుగా పరకాల ,గూడెప్పాడు మార్గంలో వరంగల్‌కు వెళ్లాలి
2. వరంగల్ నుండి ములుగు/ఏటూరునాగారం వైపు ప్రయాణించే RTC బస్సులు, కార్లు (LMV), టూ వీలర్లు
మల్లంపల్లి వద్ద నుండి డైవర్షన్ తీసుకొని శ్రీనగర్ → పందికుంట → ములుగు వైపు ప్రయాణించాలి
తిరుగు ప్రయాణంలో జాకారం నుండి అబ్బాపూర్ → గోరుకొత్తపల్లి మార్గంలో వరంగల్‌కు వెళ్లాలి
3. నర్సంపేట నుండి ములుగు వైపు ప్రయాణించే RTC బస్సులు, కార్లు (LMV)
మల్లంపల్లి నుండి శ్రీనగర్ → పందికుంట మార్గంలో ప్రయాణించాలి
తిరుగు ప్రయాణంలో పందికుంట నుండి శ్రీనగర్ → మల్లంపల్లి మార్గంలో నర్సంపేటకు వెళ్లాలి
4. నర్సంపేట నుండి ములుగు వైపు ప్రయాణించే లారీలు, డీసీఎంలు, ఇతర భారీ వాహనాలు
వరంగల్ నుండి గూడెప్పాడు మీదుగా పరకాల → రేగొండ → జంగాలపల్లి మార్గంలో ప్రయాణించాలి
తిరుగు ప్రయాణంలో జంగాలపల్లి నుండి రేగొండ → పరకాల → గూడెప్పాడు → వరంగల్ మార్గంలో నర్సంపేటకు వెళ్లాలి.RTC ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, వారిని మల్లంపల్లి నుండి శ్రీనగర్ మీదుగా పందికుంట గ్రామాల ద్వారా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఈ మార్గం మీదుగా భారీ వాహనాలను అనుమతించడం లేదు.
……………………………………………….