* 200 మంది పోలీసు సిబ్బందితో బందో బస్త్ ..
* జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయానికి జాతరకు నెలరోజుల ముందే ఉన్నప్పటికీ ఆదివారం భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ములుగు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకాన్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సుమారు 200 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, అదనపు ఎస్పీ (OSD) శివమ్ ఉపాధ్యాయ, అదనపు ఎస్ పీ సదానందం, ఏఎస్పీ మనన్బట్, డీఎస్పీ ములుగు, జిల్లాలోని అన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆలయ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నప్పటికీ, ముందస్తు ప్రణాళికతో పోలీసులు సమర్థవంతంగా జనసందోహాన్ని నియంత్రించారు. ప్రత్యేకంగా రూపొందించిన ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళిక ద్వారా ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎస్ పి చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ప్రశాంతంగా, శాంతియుతంగా దర్శనం కల్పించడంలో పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తు ట్రాఫిక్ వ్యవస్థ క్రమబద్ధీకరించారు. దీంతో భక్తులు దేవతల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

……………………………………………………………

