ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటిడిఎ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్యాణలక్ష్మి షాది ముభారక్ చెక్కులను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన అల్లంవారి ఘనపూర్ సర్పంచ్ పలక చిన్నన్న ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు . గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ములుగు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ , ఐటిడిఏ పీఓ చిత్ర మిశ్రా ,ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, మండల నాయకులు స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….

