ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని తాడ్వాయి మండలంలో వివిధ పోలింగ్ కేంద్రాలకు తరలించె ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. మొదటి విడత గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూర్ నాగారం తదితర మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం తాడ్వాయి మండలంలోని 18 గ్రామపంచాయతీ లకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండలం లోని వివిధ శాఖ ల అధికారులు తదితరులున్నారు.
………………………………………………..
