ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని దేవత ల గద్దెల ఆవరణలో మాస్టర్ ప్లాన్ తో నిర్మితమవుతున్న రాతి శిల్పాల నిర్మాణం పనులను జిల్లా ఎస్పీ సుదీర్ రామ్ నాథ్ కేకన్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ప్రస్తుతం వచ్చే జనవరి 2026,చివరి వారంలో జరగబోయే మహా జాతరను పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దేవతల గద్దెలను సునాయాసంగా దర్శించుకొని వెళ్లే విధంగా మాస్టర్ ప్లాన్ తో రాతి నిర్మాణాలతో 200 ఏళ్ళు పాటు చరిత్ర నిలిచి ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్న పనులను ఎస్పీ పరిశీలించారు.సంబంధిత ఆదివాసి ఆచార సంస్కృతి సంప్రదాయాల ను ఆదివాసి ఉద్యమ నాయకుడు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మహిపతి అరుణ్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు .రాతి శిలలపై చెక్కిన ఆదివాసీల సంస్కృతిని ఒక్కొక్కటి వివరించి ఎస్పీకి పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో మేడారం పూజారులు ,స్థానిక పోలీస్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆదివాసి సంఘాల నాయకులు, ఇంజనీరింగ్ అధికారులు ,సంబంధిత కాంట్రాక్టర్ తదితరులున్నారు.

…………………………………..
