
* యుద్ధభూమిలో ఏపీకి చెందిన జవాను మృతి
* ఏపీ సీఎం నివాళులు
* వద్దురా.. వెళ్లొద్దురా అన్నా..
ఆకేరు న్యూస్, అమరావతి : భారత్-పాకిస్థాన్ మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇరు దేశాల మధ్య బీకర దాడులు కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న యుద్ధభూమిలో ఆంధ్రప్రదేశ్ చెందిన వీరజవాన్ మురళీనాయక్ మృతి చెందారు. మురళీ నాయక్ మరణించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ ఆర్మీలో పనిచేస్తున్నారు. కల్లితండ గ్రామానికి చెందిన మురళీనాయక్ కుటుంబసభ్యులు కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న మురళీ నాయక్ వీరిని సాకేవాడు. మురళీనాయక్ సోమందేవిపల్లి మండలం నాగినాయని చెర్వు తండాలో పెరిగారు. అక్కడే పాఠశాలలో చదువుకుని ఆర్మీలో చేరాడు. వద్దురా.. ఇక్కడే కూలో నాలో చేసుకుని బతుకుదామని తల్లిదండ్రులు ఎంత చెప్పినా దేశంపై ప్రేమతో ఆర్మీలో చేరాడు. తాను చేస్తే భారత జెండా తన భౌతికకాయంతపై కప్పుతారని సగర్వంగా చెప్పేవాడని మురళీనాయక్ మేనమామ అన్నారు. తన ఇద్దరు కొడుకులను కూడా ఆర్మీకే పంపుతానని అన్నారు.
…………………………………..