* పద్మశ్రీ వరించడంపై ఆనంద భాష్పాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ అవార్డు అందించిన ప్రధానమంత్రి మోదీకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడో వస్తుందని చాలా మంది భావించినా, ఈ సంవత్సరం పద్మశ్రీ వరించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఏం మాట్లాడాలో కూడా తెలియని ఆనందంలో ఉన్నానని మీడియాతో మాట్లాడుతూ ఆనంద భాష్పాలు రాల్చారు. అందరూ ఫోన్లు చేసి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతుంటే.. చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. తమ కుటుంబంలో తొలిసారిగా తనకే పద్మ అవార్డు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ‘జగమేమాయ’ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు మురళీ మోహన్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ‘అతడు’ లాంటి మంచి సినిమాలు నిర్మించారు. త్వరలోనే తమ జయభేరి ఆర్ట్స్ లో మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించారు. జగమే మాయ, నేరము శిక్ష, తిరుపతి, రాధమ్మ పెళ్లి, భారతంలో ఒక అమ్మాయి, జ్యోతి లాంటి పలు సినిమాలు చేసిన ఆయనకు ‘వారాలబ్బాయి’ మంచి పేరు తెచ్చి పెట్టింది. శోభన్‌బాబు, గిరిబాబుతో పాటు అప్పట్లో పలువురు స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశారు మురళీమోహన్. రీసెంట్గా రిలీజ్ అయిన అఖండ2లోనూ కీలక పాత్రలో తెరపై కనిపించారు.
……………………………………………..
