*ఎంజీబీఎస్ లోకి భారీగా వరదనీరు
ఆకురు న్యూస్ హైదరాబాద్ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది..పైన ఉన్న ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ గేట్లను తెరువడంతో మూసీలోకి మూసీలో నీటి ప్రవాహం మరింత పెరిగింది. దీంతో ముసరాంబాగ్ వంతెన మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిచి పోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వంతెన సామాగ్రి వరద నీటి వేగానికి కొట్టుకుపోయింది. వరదల వల్ల పాతబస్తీ, అంబర్పేట, చాదర్ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జిపై ఆరు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు చేరింది.ఈ నేపధ్యంలో ప్రయాణికులను వేరే చోటకు తరలిస్తున్నారు.వివిధ రూట్లనుంచి ఎంజీబీఎస్ వచ్చే బస్సులను వేరే రూట్లకు మళ్లిస్తున్నారు. బతుకమ్మ దసరా పండగలు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసీ అధికారులు పరత్యామ్నాయ చర్యలు చేపట్టారు
………………………………………
