
* ఆద్యకళా మ్యూజియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్, స్టేషన్ ఘనపూర్ : చిల్పూర్ మండలం సీత్యతండా గ్రామం వద్ద ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను తెలిపే ఆద్యకళా మ్యూజియం నిర్మాణానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజనుల కలలు, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడంలో, భావి తరాలకు అందించడంలో మ్యూజియంలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్నారు. మ్యూజియం ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. మ్యూజియంకు సంబందించిన డిపిఆర్ సిద్ధం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, గిరిజనులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….