
* కాంగ్రెస్ పై బండి సంజయ్ ధ్వజం
ఆకేరు న్యూస్.డెస్క్ : కాంగ్రెస్‌పై బండి జంజయ్ మరో సారి ధ్వజం ఎత్తారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై నెపం మోపాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించే పనిలో ఉందని అన్నారు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు పెంచి మొత్తం 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తీరు మారకుంటే తెలంగాణలోనూ కనుమరుగవడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే యూపీ,బిహార్,బెంగాల్ లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు వందశాతం రిజర్వేషన్లు కల్పించేందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోందే తప్ప బీసీల కోసం కానేకాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని క్లారిటీ ఇచ్చారు.
………………………………………..