* బ్రేక్ టైంలో పండ్లు, పెసర్లు, మిల్లెట్ బిస్కెట్లు
* హాస్టల్ విద్యార్థులకు కొత్త మెనూ
* పౌష్ఠికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కలుషిత ఆహార, విద్యార్థులు అస్వస్థతకు గురికావడం వంటి ఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(TELANGANA GOVERNMENT) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూ(NEW MENU) ప్రారంభించనుంది. నెలకు రెండు సార్లు లంచ్‌లో మటన్(MUTTON), నాలుగు సార్లు చికెన్(CHICKEN) పెట్టనున్నారు. ఇక మిగతా రోజుల్లో ఉడికించిన కోడి గుడ్డు, కిచిడీ, ఇడ్లీ, వడ, పూరి, బోండా, పులిహోరాతో పాటు రాగి జావ, పాలు వంటివి ఇవ్వనున్నారు. విరామ సమయంలో ఏదైన పండుతో పాటు పెసర్లు, బటానీలు, మిల్లెట్ బిస్కెట్లు ఇవ్వనున్నారు. ఇలా ఒక్కో వారానికి ఒక్కో మెనూ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్టళ్లలో కేవలం చికెన్ మాత్రమే పెడుతున్నారు. కానీ ఇకపై నెలలో మొదటి, మూడో ఆదివారం మధ్యాహ్నం సమయంలో విద్యార్థులకు బగారా రైస్, మటన్ కర్రీ పెట్టనున్నారు.
…………………………………