
* అదిరిపోయే టీజర్‌తో ‘బ్లడీ’ ప్రేమకథ
ఆకేరు న్యూస్, సినీ డెస్క్ : టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రష్మిక మందన్న రొమాంటిక్ హార్రర్‌తో మూవీ థామాతో బాలీవుడ్లో మరింత అలరించేందుకు సిద్ధమైంది. “నా దర్ కభీ ఇత్నా శక్తిషాలీ థా, ఔర్ నా ప్యార్ కభీ ఇత్నా బ్లడీ” అంటూ మూవీ టీజర్ (Teaser) ను ఈరోజు రిలీజ్ చేశారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె నటించిన ఈ ‘బ్లడీ’ ప్రేమకథలో నవాజుద్దీన్ సిద్ధిఖీ దేశీ వాంపైర్‌గా నటించారు. హారర్ థ్రిల్లర్ ‘థామా’ (Thama) చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. దీపావళి కానుకగా అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో ప్రధాన పాత్రల పేర్లు, వారి లుక్స్‌ను పరిచయం చేస్తూ పోస్టర్లు కూడా విడుదల చేసింది. మ్యాడ్‌డాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో ఇప్పటివరకు ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’ వంటి హారర్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రేమే ప్రధాన సూత్రధారమని బాలీవుడ్ టాక్. ఇందులో ఆయుష్మాన్ ఖురానా ‘అలోక్’గా, రష్మిక ‘తడకా’గా కనిపించనున్నారు.
…………………………………………….