
* ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సంచలనం చోటుచేసుకోనుంది. వైఎస్సార్ మనవడు, షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ అరంగేట్రంపై స్వయంగా వైఎస్ షర్మిల ప్రకటన చేయడంతో ఊహాగానాలకు తెరపడింది. తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, తల్లి వైఎస్ షర్మిల వారసుడిగా రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని ఆమె స్పష్టం చేశారు.వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన కడప నుంచి ఈ వారసత్వం మొదలవుతుందా, లేక పులివెందుల నుంచి మొదలవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో షర్మిల కడప ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు ఆమె కుమారుడి ఎంట్రీతో వైఎస్ కుటుంబ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడనున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం జగనుకు ఎంపీ టికెట్ కేటాయించినట్లు, రాజారెడ్డికి కేటాయిస్తుందా లేదా పులివెందుల నుండి రంగంలోకి దింపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ప్లానింగ్ చూస్తుంటే వెనక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ వుందా? లేదా విజయ సాయిరెడ్డి రాజకీయ సాయం వుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. జగన్ కుమారుడు లేకపోవడం, షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో భవిష్యత్తులో ఈ ఇద్దరు అన్నా చెల్లి మధ్య పోటీ వుంటుందా.. లేదా ఆపాటికి జగన్ జైలుకు వెళ్లి, సంధింటి నుండి జగన్ స్థానాన్ని షర్మిళ భర్తీ చేస్తుందా కాలమే సమాధానం చెబుతుంది..
………………………………