
ఆకేరున్యూస్, ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇప్పటికే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మహాకుంభమేళాను సందర్శించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
……………………………………