
* జనసేన నుంచి ఆయన పేరును ఖరారు చేసిన పవన్
ఆకేరు న్యూస్, మంగళగిరి : ఏపీలో ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా కొణిదెల నాగబాబు (Konidela Nagababu) పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pavank Kalyan)ఖరారు చేశారు. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా నాగబాబుకు సమాచారం ఇచ్చారు. పార్టీ విజయం కోసం పవన్ సోదరుడు.. నాగబాబు విశేషంగా కృషి చేశారు. అయినప్పటికీ పార్టీ సీట్ల సర్దుబాటులో ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆ తర్వాత లోక్ సభకు పంపుతారని, మంచి కార్పొరేషన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి నాగబాబు(Nagababu) పేరు ఖరారైంది. ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటామని గతంలో చంద్రబాబు కూడా చెప్పారు. ఈక్రమంలో ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది.
…………………………………..