
ఆకేరు న్యూస్, నాగార్జున సాగర్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో ఎగువ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ (Nagarjuna sagar) కు చేరే నీటి వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆదివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా జూలై నెలలో ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్‌కు పర్యటకులు ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. కాగా, పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి నాగార్జున సాగర్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. వరద ఉధృతిని బట్టి నీటి విడుదలకు గేట్లను ఎత్తుతామని సూచించారు.
…………………………………..