King 100 Movie vs King
* ఒకే రోజు నాగార్జున, షారుఖ్ ఖాన్ సినిమాలు
ఆకేరు న్యూస్, డెస్క్: క్రిస్మస్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీకి రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రెండు సినిమాల టైటిల్స్‌లో ‘కింగ్’ ఉండటంతో ఈ క్లాష్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
* నాగార్జున 100వ సినిమా ‘కింగ్ 100’
నాగార్జున తన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 100వ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా** విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
నాగార్జునకు డిసెంబర్ సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో ‘మన్మథుడు’, ‘మాస్’, ‘రగడ’ వంటి సినిమాలు క్రిస్మస్ సమయంలో ప్రేక్షకులను అలరించాయి. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు తన 100వ సినిమాను కూడా డిసెంబర్లోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
* అదే రోజు షారుఖ్ ‘కింగ్’
మరోవైపు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా కూడా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో ఒకే రోజు ‘కింగ్ 100’ vs ‘కింగ్’ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారనుంది. రెండు సినిమాలు వేర్వేరు భాషల్లో తెరకెక్కుతున్నప్పటికీ, రెండు చిత్రాలకూ వరల్డ్ వైడ్ రిలీజ్ ఉండటంతో పోటీపై చర్చ జరుగుతోంది.
* టైటిల్ విషయంలోనూ ఆసక్తే..
నాగార్జునను అభిమానులు ప్రేమగా ‘కింగ్’ అని పిలుస్తారు. గతంలో ఆయన ‘కింగ్’ పేరుతోనే సినిమా కూడా చేశారు. ఇప్పుడు తన 100వ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్ పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
అటు షారుఖ్ ఖాన్‌ను బాలీవుడ్లో ‘కింగ్ ఖాన్’ అని పిలుస్తుంటారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి కూడా ‘కింగ్’ అనే టైటిల్‌నే పెట్టారు. దీంతో డిసెంబర్ 24న ఒకే టైటిల్‌కు దగ్గరగా ఉన్న రెండు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో షారుఖ్ సినిమా మల్టీప్లెక్స్‌లలోనూ, హిందీ మార్కెట్లో నాగార్జున సినిమా విడుదలతోనూ ఈ క్లాష్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
