* రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
* భారీ రోడ్ షోకు ప్రణాళికలు
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఏపీ పర్యటకు విచ్చేయనున్నారు. విశాఖ(VISAKHA)కు చేరుకుని భారీ స్థాయిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల నుంచి 6.45 వరకు సభ నిర్వహించనున్నారు. రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే జోన్(RAILWAY ZONE), పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం భారీ రోడ్ షో(ROAD SHOW)కు ప్రణాళికలు రచిస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి భారీ రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. రోడ్ షో అనంతరం సభలో పాల్గొననున్నారు. సిరిపురం నుంచి ఏయూ ఇంజనీరింగ్ మైదానం వరకు మోదీ రోడ్ షో (MODI ROAD SHOW)కొనసాగనుంది. తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ నిర్వహిస్తారు. విశాఖలో సుమారు 3 గంటలపాటు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని. ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 6.50 గంటలకు వేదిక నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు. 07.15కు విశాఖ నుంచి విమానంలో భువనేశ్వర్ కు వెళ్తారు.
……………………………………….