* ఎగిసిపడుతున్న మంటలు
* మంటలు ఆర్పుతున్న ఫైరింజన్లు
* షార్ట్ సర్య్కూటా..? ఇతర కారణాలా..?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని ప్రమాద శాఖ అధికారులు ఫైరింజన్లతో ప్రమాద స్థలికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పి వేస్తున్నారు. మంటల తీవ్రత తగ్గినప్పటికీ దట్టమైన పొగ ల్యాబ్ అంతా ఆవరించి ఉంది. ఈ ప్రమాద సమయంలో ల్యాబ్లో ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు గా తెలుస్తోంది. ఒకరికి గాయాలు కావడంతో ఆయనను ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబందించి కారణాలు తెలియరావడం లేదు. ప్రాథమిక అంచన ప్రకారం షార్ట్ సర్య్కూట్ కారణం కావొచ్చంటున్నారు. ఇతర కారణాలు కూడా ఏమైనా ఉండొచ్చా అని అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేర పరిశోధనలో అత్యంత కీలక భూమిక పోషించే ల్యాబ్లో అగ్న ప్రమాదం జరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలికి నార్త్ జోన్ డీఐజీ శ్వేత , డీసీపీ శిల్ప వల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
—————————–
