ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఇస్రో కొత్త చైర్మెన్‌గా నారాయణన్‌ను నియమించారు. ప్రస్తుతం ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్థానంలో ఈనెల 14న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా నారాయణన్‌ను నియమించారు. ఎల్పీఎస్సీ అధిపతిగా ఉన్న నారాయణన్.. రెండేళ్ల పాటు ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ మంగళవారం రిలీజ్ చేసిన ఓ నోటిఫికేషన్లో పేర్కొన్నది. స్పేస్ కమీషన్‌కు కూడా ఆయన చైర్మెన్‌గా కొనసాగనున్నారు.
……………………………………………