
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ నార్కోటిక్స్ పోలీస్‌స్టేషన్‌ను బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నార్కోటిక్స్ బ్యూరో సూపరింటెండెంట్ ఆఫ్ పొలీస్ CH. రూపేష్ సందర్శించారు.
ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది వివరాలు తెలుసుకోవడంతో పాటు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, వాడకాన్ని పూర్తిగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సమావేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని CH. రూపేష్, IPS గారు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుండి రక్షించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో కే.సైదులు, DSP, బి.రవిందర్, ఇన్స్పెక్టర్ మరియు SIలు సిబ్బంది పాల్గొన్నారు.
……………………………….