
* రెస్టారెంట్ యజమాని నుండి రూ. 60వేలు డిమాండ్
* డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దుర్గాప్రసాద్
ఆకేరు న్యూస్ డెస్క్ : వరంగల్ లో నేషనల్ హైవే అథారిటి డైరెక్టర్ గా పనిచేస్తున్నదుర్గాప్రసాద్ ను సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాల్లో కి వెళితే బీబీ నగర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆ రెస్టారెంట్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని రెస్టారెంట్ యజమానిని బెదిరించిన దుర్గా ప్రసాద్ రెస్టారెంట్ నిర్వహణకు యజమాని వద్ద నుండి లంచం డిమాండ్ చేశారు. తనకు ఇంకా 5 సంవత్సరాల పదవీ కాలం ఉందని తనకు కొంత అమౌంట్ ఇస్తే ఈ ఐదేళ్లు రెస్టారెంట్ కు ఏ అటంకం లేకుండా తను చూసుకుంటానని రెస్టారెంట్ యజమానికి హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న సీబీఐ అధికారులు బుధవారం రెస్టారెంట్ యజమానివద్ద నుండి దుర్గాప్రసాద్ రూ 60వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్, వరంగల్,సదాశివపేటలో ఉన్న దుర్గాప్రసాద్ నివాసాల్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.