
* హనుమకొండ , పరకాల కోర్టులలో నిర్వహణ
ఆకేరు న్యూస్, హనుమకొండ : జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం
సెప్టెంబరు 13వ తేదీన హనుమకొండ జిల్లా కోర్టులో, పరకాల కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తారు.
ఇప్పటికే హనుమకొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులలో
మొత్తం 1011 రాజీపడదగు పెండింగ్ కేసులలో కక్షిదారులకు హనుమకొండ జిల్లా న్యాయ
సేవాధికార సంస్థ నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ 667, ఎన్ ఐ యాక్ట్ – 65, బ్యాంకు
రికవరీ – 5, భూ తగాదాల కేసులు – 2 , ఎంఏసీటీ – 69, వివాహ సంబంధిత – 148, అదర్ సివిల్
కేసులు – 55, ప్రీ లిటిగేషన్ బ్యాంకు కేసులు – 342, ప్రీ లిటిగేషన్ బీఎస్ ఎన్ ఎల్ కేసులు – 402 పరిష్కరించేందుకు హనుమకొండ జిల్లా కోర్టులో 10, పరకాల కోర్టులో 1 బెంచీలను ఏర్పాటు చేశారు. ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కారం చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా తమ న్యాయవాదులతో రావాలని కోరారు.
……………………………