ఎమ్మెల్సీగా నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డి(Naveen Kumar Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా నవీన్ విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కేసీఆర్(KCR) కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు తన విజయాన్ని అంకితం చేస్తున్నాని వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లాలో తనను గెలిపించి పాలమూరు కేసీఆర్ అడ్డా అని ప్రజలు మరోమారు నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పొల్గొన్నారు.
——————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
