* కలెక్టర్ ఆదేశాలతో డీఈవో ఉత్తర్వులు
ఆకేరు న్యూస్, కరీంనగర్ :
విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్య లు తీసుకున్నట్లు డీఈవో తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులు, హుజురాబాద్ మండలం చెల్పూర్ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఉపాధ్యాయులు ఐలయ్య, ప్రవీణ్ కుమార్, సమ్మయ్య సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
పాఠశాలకు మద్యం సేవించి హాజరైనట్లు ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఉపాధ్యాయుడు ఐలయ్య విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, పాఠశాల కార్యక్రమాలలో సహకరించకపోవడం వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు ఉపాధ్యాయులు తమ ప్రవర్తనను మార్చుకోకుండా పదే పదే ఇవే చర్యలకు పాల్పడటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేసినట్లు డీఈవో స్పష్టం చేశారు.
