
* హింసాత్మకంగా మారిన ఘటనలు
* ఆర్మీ కాల్పుల్లో ఒకరి మృతి
ఆకేరు న్యూస్, డెస్క్: నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సప్, ఎక్స్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లను దేశంలో నిషేధించింది. దీనిపై ఉవ్వెత్తున నిరసనల వ్యక్తం అవుతున్నాయి. బ్యాన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దైనందిన వ్యాపార, సామాజిక కార్యకలాపాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ఖాట్మాండు మేయర్ బాలేంద్ర షా కూడా యువత ఆందోళనలకు మద్దతు తెలిపారు. GEN-Z పేరుతో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వారిని పోలీసులు అదుపుచేయలేకపోయారు. దీంతో నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో ఒకరి మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. ఖాట్మండుతో పాటు 10 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్మీ రంగంలోకి దిగినా ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో రాజధానిలో కర్ఫ్యూ విధించారు.
………………………………………..