
* వివాహేతర సంబందమే కారణమా.?
ఆకేరు న్యూస్,కర్నూలు : రోజు రోజుకీ జరుగుతున్న దారుణాలు వినడానికి విస్మయానికి గురి చేస్తున్నాయి తాజాగా కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఈ సంఘటన జరిగింది. పిన్నాపురానికి చెందిన ఐశ్వర్య తెలంగాణలోని గద్వాలకు చెందిన తేజేశ్వర్ తో ఇటీవలే వివాహం జరిగింది. ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్న తేజేశ్వర్ ను ఐశ్వర్య హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐశ్వర్య తల్లి సుజాత, ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తో కలిసి ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబందమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా పోలీసులు ఐశ్వర్యను ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
………………………………………